కామారెడ్డి, మే 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి మండలి చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా 50వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా రక్తదానంలో తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శం అని, ఎంతో మంది యువకులు ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తదానం చేస్తూ ఉండడం అభినందనీయమన్నారు.
గత 14 సంవత్సరాలుగా వ్యక్తిగతంగా 66 సార్లు రక్తదానం చేయడమే కాకుండా, 10వేల యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందజేసిన రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును ప్రత్యేకంగా అభినందించారు. రక్తదానంలో కామారెడ్డి రక్తదాతలు చేస్తున్న కృషిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి, కేటీఆర్ దృష్టికి తీసుకు వెళతాననీ అన్నారు.
కామారెడ్డి జిల్లాలో పేదవారికి తన వంతు సహాయ సహకారాలు చేయడానికి సిద్ధమని తెలిపారు. రక్తదానం చేసిన రక్త దాతలకు ప్రశంసా పత్రాలు అందజేసి, అభినందించారు. శిబిరంలో 29 మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు యాద నాగేశ్వర్ గుప్తా, జిల్లా అధ్యక్షుడు మహేష్ గుప్తా, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బాలు, డాక్టర్ వేద ప్రకాష్, పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు శ్రీకాంత్ గుప్తా, సురేష్ రెడ్డి, జమీల్ అహ్మద్, శ్రీకాంత్ రెడ్డి, శైలేందర్ నాగసాయి, రక్త దాతలు పాల్గొన్నారు.