నిజామాబాద్, మే 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2021-22 విద్యా సంవత్సర ఇంటర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మొదటి సంవత్సరం విద్యార్థుల పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. మొత్తం 17,932 మంది విద్యార్థులకు గాను 793 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 17,139 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు.
వీరిలో 15,740 మంది జనరల్ విద్యార్థులకు గాను 584 మంది విద్యార్థులు గైర్ హాజరుకాగా 15,156 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఒకేశనల్ 2192మంది విద్యార్థులకు గాను 209 మంది విద్యార్థులు గైర్ హాజరుకాగా 1983 మంది విద్యార్థులు హాజరైనట్లు డి.ఐ.ఈ.ఓ. తెలిపారు. మొత్తం 95.6 శాతం మంది విద్యార్థులు మొదటి రోజు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు.
బోధన్ విజయ్ సాయి జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి కాపి చేస్తుండగా మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లా ఇంటర్ విద్యా అధికారి గోల్డెన్ జుబిలీ కళాశాల, ఎస్‌ఎస్‌ఆర్ కళాశాల, నిజామాబాద్ ఆర్మూర్ రోడ్ లోని ఎస్.ఆర్. కళాశాల, ఉమెన్స్ కళాశాలలో తనిఖీ చేశారు. అలాగే పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిరంజీవి, చిన్నయ్య, కనకమహాలక్ష్మిలు 5 పరీక్ష కేంద్రాలను, హైపవర్ కమిటీ రవికుమార్ 5 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అలాగే ఫ్లయింగ్, సెట్టింగ్ స్క్వాడ్ బృందాలు 20 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మొత్తం 34 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యా అధికారి రఘురాజ్ తెలిపారు.