కామారెడ్డి, మే 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డ్రోన్ యంత్రం ద్వారా పురుగుమందులు పిచికారి చేయడం సులభమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద శుక్రవారం డ్రోన్ యంత్రం ద్వారా పురుగుమందులు పిచికారీ చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
7 నిమిషాల్లో ఎకరం పంటకు పురుగుమందులు పిచికారి చేయవచ్చని సూచించారు. మహిళా సంఘాలు డ్రోన్ యంత్రాలు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. సదాశివనగర్, రామారెడ్డి, లింగంపేట్, గాంధారి, రాజంపేట, మద్దునూర్, బిచ్కుంద, బీర్కూర్, మాచారెడ్డి మండల సమైక్య మహిళలు ముందుకు వచ్చారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిపీఎంలు సుధాకర్, రమేష్ బాబు, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు.