నిజామాబాద్, మే 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ పరీక్షల్లో రెండవ రోజు జిల్లాలో ఒక విద్యార్థి పై మాల్‌ప్రాక్టీస్ కేసుల నమోదు కాగా 824 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 17,793 మంది విద్యార్థులకు గాను 16,899 మంది విద్యార్థులు హాజరుకాగా జనరల్ 15776 విద్యార్థులకు గాను 694 మంది విద్యార్థులు గైర్ హాజరు కాగా 15,082 విద్యార్థులు హాజరయ్యారు.
ఒకేషనల్ 2017 మంది విద్యార్థులకు గాను 200 మంది విద్యార్థులు గైర్ హాజరుకాగా 1,817 మంది విద్యార్థులు హాజరయ్యారు. నిజామాబాద్ పట్టణంలోని ఆరు జూనియర్ కళాశాలలను జిల్లా ఇంటర్ విద్య అధికారి లోకం రఘురాజ్ తనిఖీ చేశారు. ఆర్యనగర్ ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల, ఆర్మూరు రోడ్డు లోని 2 ఎస్‌ఆర్ కళాశాల లను, అలాగే నిజామాబాద్ బాలుర జూనియర్ కళాశాల, వెక్టర్ జూనియర్ కళాశాలలో తనిఖీ చేశారు.
జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిరంజీవి, చిన్నయ్యలు 8 పరీక్ష కేంద్రాలను, హైపవర్ కమిటీ రవి కుమార్ 5 పరీక్షా కేంద్రాలను, ఫ్లయింగ్ సెట్టింగ్ స్క్వాడ్ బృందాలు 22 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. మొత్తం నలభై ఒక పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఆర్మూర్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి కాపి చేస్తుండగా అతనిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలిపారు.