హిందీలో శ్రీనివాస్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, మే 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో హిందీ విభాగంలో పరిశోధక విద్యార్థి హజారే శ్రీనివాస్‌కు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా – వోస్‌ (మౌఖిక పరీక్ష) సోమవారం ఉదయం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలోని లాంగ్వేజ్‌ లాబ్‌లో నిర్వహించారు.

హిందీ శాఖ విభాగాధిపతి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. వి. పార్వతి పర్యవేక్షణలో ‘‘సమకాలీన హిందీ నాటకాలు మరియు ఏకాంకికల అనుశీలన (2000-2010)’’ అనే అంశంపై పిహెచ్‌. డి. పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించి సమర్పించారు.

వైవా – వోస్‌కు ఎక్స టర్నల్‌ ఎగ్జామినర్‌ గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని హిందీ విభాగానికి చెందిన విభాగాధిపతి అండ్‌ చైర్‌ పర్సన్‌ డా. మాయాదేవి విచ్చేసి సిద్ధాంత గ్రంథంపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు.

పరిశోధకులు హజారే శ్రీనివాస్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జక్రాన్‌ పల్లి హిందీ భాషోపాధ్యాయులు. పది సంవత్సరాల పరిమిత కాలంలో హిందీ భాషలో వెలువడిన నాటకాలను మరియు ఏకాంకికలను ఎంచుకొని అధ్యాయాల వారిగా వివరాలను తెలిపారు. నాటకాలలో ప్రదర్శింపబడిన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా తదితర అంశాలను, వాటి ప్రాధాన్యతను వివరించారు. హజారే శ్రీనివాస్‌ పరిశోధనా దృక్పథాన్ని డా. మాయాదేవి ప్రశంసించారు.

వైవా – వోస్‌కు చైర్మన్‌గా ఆర్ట్స్‌ విభాగ పీఠాధిపతి ప్రొఫెసర్‌ కనకయ్య, కన్వీనర్‌గా హిందీ బిఒఎస్‌ డా. ఎం డి జమీల్‌ మహ్మద్‌, పూర్వ విభాగాధిపతి డా. ప్రవీణాబాయి, ఇతర విభాగాల అధ్యాపకులు డా. నాగరాజు, డా. బాలకిషన్‌, డా. మహేందర్‌ రెడ్డి, డా. గుల్‌ ఇ రాణా డా. అబ్దుల్‌ ఖవి, పట్కారి సమాజ్‌ ప్రముఖులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

హజారే శ్రీనివాస్‌ డాక్టరేట్‌ సాధించడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌, ప్రిన్సిపల్‌ ఆచార్య సిహెచ్‌. ఆరతి, కంట్రోలర్‌ ఆచార్య ఎం. అరుణ, పీఆర్‌ఓ డా. వి. త్రివేణి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »