ఆర్థిక శాస్త్ర విభాగంలో తిరుపతి గౌడ్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, మే 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి ఐ. తిరుపతి గౌడ్‌ కు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా – వోస్‌ (మౌఖిక పరీక్ష) సోమవారం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించారు.

అనువర్తిత ఆర్థిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉండి ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. బి. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ‘‘పేదరిక నిర్మూలనలో ఆసరా పెన్షన్‌ల ప్రాధాన్యం – తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన జిల్లాలపై ఒక అధ్యయనం’’ అనే అంశంపై పిహెచ్‌. డి. పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించి సమర్పించారు.

ఎక్స టర్నల్‌ ఎగ్జామినర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్థిక శాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ సుధాకర్‌ రెడ్డి విచ్చేసి సిద్ధాంత గ్రంథంపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశోధకులు ఐ. తిరుపతి గౌడ్‌ తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలను ఎంపిక చేసుకొని అందులో గల వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్‌ఐవి / ఎయిడ్స్‌ బాధితులు, నేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు అందుకున్న ఆసరా పెన్షన్‌ పథకాలపై ప్రత్యేక అధ్యయనం చేశారని ప్రొఫెసర్‌ సుధాకర్‌ రెడ్డి ప్రశందించారు. తెలంగాణ రాష్ట్రంలోని పేదరిక నిర్మూలనకు అనువైన అంశాలను గణాంకాలతో సూచించిన పరిశోధకుడిని అభినందించారు.

వైవా – వోస్‌కు చైర్మన్‌గా సోషల్‌ సైన్స్‌ ఫాకల్టీ పీఠాధిపతి అండ్‌ రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌, కన్వీనర్‌ గా ఆర్థిక శాస్త్ర బిఒఎస్‌ డా. ఇ. పున్నయ్య వ్యవహరించారు. విభాగాధిపతి టి. సంపత్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. పాత నాగరాజు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. స్వప్న తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఐ. తిరుపతి గౌడ్‌ డాక్టరేట్‌ సాధించడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌, ప్రిన్సిపల్‌ ఆచార్య సిహెచ్‌. ఆరతి, కంట్రోలర్‌ ఆచార్య ఎం. అరుణ, పీఆర్‌ఓ డా. వి. త్రివేణి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »