ఇంటర్‌ పరీక్షలు…. ఒకరిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు

నిజామాబాద్‌, మే 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో సోమవారం జరిగిన మొదటి సంవత్సరం ఇంగ్లీష్‌ పరీక్షలో జిల్లాలో ఒకరిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు కాగా 822 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌తో పాటు, అధికారి రజీయుధిన్‌ నిజామాబాద్‌ పట్టణంలోని 8 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు.

మొత్తం 18,036 మంది విద్యార్థులకు గాను 17,214 మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్‌ 15,820 మంది విద్యార్థులకు గాను 15,207 మంది విద్యార్థులు హాజరుకాగా 613 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. ఒకేషనల్‌ మొత్తం 2,216 మంది విద్యార్థులకు గాను 2,007 మంది విద్యార్థులు హాజరుకాగా 209 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

ఆర్మూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఒక విద్యార్థి కాపీయింగ్‌ పాల్పడుతుండగా మాల్ప్రాక్టీస్‌ కేసు నమోదు చేసినట్లు జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి రఘురాజ్‌ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాకతీయ మహిళా జూనియర్‌ కళాశాల, శ్రీ కాకతీయ జూనియర్‌ కళాశాల, నారాయణ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, ఏ,బి, సెంటర్‌లను, నిర్మల హృదయ కళాశాల, ఆర్మూర్‌ రోడ్‌లోని ఎస్‌ .ఆర్‌. జూనియర్‌ కళాశాల తనిఖీ చేశారు.

పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిరంజీవి, చిన్నయ్య 6 పరీక్ష కేంద్రాలను, హైపవర్‌ కమిటీ రవికుమార్‌ 6 పరీక్ష కేంద్రాలను, ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 21 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి తెలిపారు. మొత్తం 42 పరీక్ష కేంద్రాలను సోమవారం తనిఖీ చేశామన్నారు. మొత్తం 95.4 శాతం విద్యార్థులు పరీక్షలు రాసారని డి.ఐ.ఈ.ఓ. తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »