డిచ్‌పల్లి, మే 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యూకేషన్ (బి.పి.ఎడ్.) కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 16 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు.
అంతేగాక 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 17 వ తేదీ వరకు పరీక్షా ఫీజు చెల్లించవచ్చని ఆమె పేర్కొన్నారు. కావున ఈ విషయాన్ని బి.పి.ఎడ్. కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.