డిచ్పల్లి, మే 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 23 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు.
అంతేగాక 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 25 వ తేదీ వరకు, 500 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 26 వ తేదీ వరకు, 1000 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 27 వ తేదీ వరకు, 2000 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 28 వ తేదీ వరకు పరీక్షా ఫీజు చెల్లించవచ్చని ఆమె పేర్కొన్నారు.
కావున ఈ విషయాన్ని డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు.