డిచ్‌పల్లి, మే 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ (ఎపిఇ, పిసిహెచ్ అండ్ ఐఎంబిఎ) కోర్సులకు చెందిన పీజీ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు.
ఉదయం జరిగిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 2700 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 2463 మంది హాజరు, 237 మంది గైర్హాజరు అయినట్లు ఆమె తెలిపారు. మధ్యాహ్నం జరిగిన ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 126 నమోదు చేసుకోగా 125 మంది హాజరు, ఒకరు గైర్హాజరు అయినట్లు ఆమె తెలిపారు.
ఆర్మూర్‌లోని సక్సెస్ డిగ్రీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ కళాశాలలో గల పరీక్షా కేంద్రంలో మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలో మైక్రో బయోలజీ సబ్జెక్టులో ఒకరు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ డిబార్ అయినట్లుగా అమె తెలిపారు.