కామారెడ్డి, మే 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద మొదటి విడత ఎంపికైన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం ఇంజనీరింగ్ అధికారులతో మంజూరైన పాఠశాలల ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు.
ప్రతి ఇంజనీరింగ్ అధికారి రోజుకు మూడు పాఠశాలల చొప్పున ప్రతిపాదనలను పూర్తిచేయాలని సూచించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. సమావేశంలో స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, వివిధ శాఖల డిప్యూటీ ఇంజనీర్లు, ఇంజనీర్లు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.