కామారెడ్డి, మే 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో స్వచ్ఛందంగా సేవలందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
జిల్లాలో గత సెప్టెంబర్ లో అంగన్ వాడి కేంద్రాలలో పోషకాహార లోపంతో 1400 మంది పిల్లలు ఉన్నారని చెప్పారు. వారిని అంగన్వాడి కార్యకర్తలతో గుర్తించి అదనంగా పోషకాహారం అందించడం వల్ల ప్రస్తుతం వారి సంఖ్య 350 మందికి తగ్గిందని తెలిపారు. పిల్లలకు పోషక ఆహారం సక్రమంగా అందే విధంగా రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు చూడాలన్నారు.
మండలాల వారీగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఏం. రాజున్న, ప్రతినిధులు నాగరాజ్ గౌడ్, సంజీవరెడ్డి, రమేష్ రెడ్డి పాల్గొన్నారు.