నందిపేట్, మే 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని మస్జిద్ మౌజా బింతే అలీ ప్రాంగణంలో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన జమాత్ ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షుడు మంజూర్ మోహిఉద్దీన్ మాట్లాడారు. ప్రజలలో సోదర భావం పెంపొందించడమే లక్ష్యంగా జమాత్ ఇస్లామి హింద్ భారత దేశం అంతట ఈద్ మిలాప్ కార్యక్రమం ఏర్పాటు చేసి భిన్న మతాల ప్రజలను ఐక్యం చేస్తున్నట్లు తెలిపారు.
సమాజంలో అందరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ కుల మతాలకతీతంగా భిన్నత్వంలో ఏకత్వంగా ఉండి ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా ఉందని జమాత్ ఇస్లామి తెలుగు వక్త షేక్ హుస్సేన్ అన్నారు. అన్ని మత గ్రంథాల సారాంశం ఒక్కటే అని వివరించారు. హిందూ, ముస్లింలు హాజరై మత సామరస్యాన్ని చాటారు. కార్యక్రమం అనంతరం ఈద్ మిలాప్ సందర్భంగా ఈద్ సెమియలు వడ్డించారు.
కార్యక్రమంలో కొండూరు ఎంపీటీసీ రాజు, కో అప్సన్ మెంబర్ సయ్యద్ హుస్సేన్, మండల ముస్లిం కమిటీ నాయకులు కాలీమ్, టిఆర్‌ఎస్ నాయకులు బాబురాజ్, బజరంగ్ చౌహన్, బిఎస్‌పి నాయకులు సుధాకర్, జమియత్ ఉలేమా హింద్ మౌలానా రషీద్ మజీద్ మౌజా కమిటీ సభ్యులు గౌస్, ఆఫ్రొజ్ ఖాన్, ఫరూక్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.