గాంధారి, మే 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు చేస్తే కార్యకర్తలు గుణపాఠం చెబుతారని గాంధారి కాంగ్రెస్ నాయకులు మదన్ మోహన్ రావు ను హెచ్చరించారు. శనివారం మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ లో గ్రూప్ రాజకీయాలు చేస్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్న మదన్ మోహన్ రావుకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు.
అదే విదంగా ఎప్పుడు నియోజకవర్గంలో కానీ, మండలంలో మదన్ మోహన్ రావు పర్యటించిన సందర్బంలో తన వెంట కాంగ్రెస్ నాయకులు ఎవరూ ఉండరని, కేవలం తాను ఏర్పాటు చేసుకున్న యంవైఎఫ్ టీం మాత్రమే ఉంటుందన్నారు. అలాంటి యంవైఎఫ్ సభ్యులనే కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పుకుంటూ తిరుగుతాడని అన్నారు. సొంత ఎజెండాతో సొంత వర్గం వారిని మాత్రమే తన దగ్గరికి రానిస్తాడని అన్నారు. ఈ విషయమై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి పిర్యాదు చేయగా జిల్లా కాంగ్రెస్ కమిటీ మదన్ మోహన్ రావును ఏడాది పాటు కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకున్నా కూడా మారకపోవడం విడ్డురం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని రెండుగా విడగొట్టి పార్టీని నియోజకవర్గంలో బలహీన పర్చడానికి చుస్తే కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. గాంధారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఐక్యంగా ఉండాలని కోరుకుంటారని అలాంటి వారిని విడగొట్టే ప్రయత్నం మానుకోవాలని మదన్ మోహన్ రావుకు హితవు పలికారు.
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గురించి నీకార్సైన కార్యకర్తలు మాటాడుతారు కానీ మీలాంటి పార్టీ నుండి సస్పెండ్ అయిన మీ లాంటి కోవర్ట్ నాయకులు కాదని, ఇక ముందు మండలంలో ఎప్పుడైనా పర్యటించినా, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినా అందరిని కలుపుకొని పోవాలని, కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తే ఖబడ్డార్ అని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీ కామెల్లి బాలరాజ్, లైన్ రమేష్, వెంకట్ రెడ్డి, వెంకట్రామి రెడ్డి, సుభాష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.