నిజామాబాద్, మే 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ పరీక్షల్లో ఎనిమిదవరోజు శనివారం రెండవ సంవత్సరం గణితశాస్త్రం-2, జువాలజీ-2, హిస్టరీ-2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. శనివారం జరిగిన పరీక్షల్లో జిల్లాలో ఇద్దరు విద్యార్థులు కాపి చేస్తుండగా మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
మొత్తం 14,631 మంది విద్యార్థులకు గాను 662 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 13,969 మంది విద్యార్థులు ( 95.5 శాతం) పరీక్షలకు హాజరు అయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, గోల్డెన్ జూబ్లీ జూనియర్ కళాశాల, ఎస్.ఆర్. జూనియర్ కళాశాలల్లో జిల్లా ఇంటర్ విద్యా ఆధికారి తనిఖీ చేసి సమీక్షించారు. అలాగే పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యుడు చిరంజీవి నిజామాబాద్ ఆర్మూర్ రోడ్ లోని రెండు ఎస్.ఆర్. జూనియర్ కళాశాలలు, గాయత్రి జూనియర్ కళాశాల, ఆర్మూర్ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల, క్షత్రియ జూనియర్ కళాశాల, భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, కృష్ణవేణి స్కూల్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు.
పరీక్షల నిర్వహణ కమిటీ మరో సభ్యుడు చిన్నయ్య మాక్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఐలపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, నందిపెట్ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల తనిఖీ చేశారు. హైపవర్ కమిటీ రవికుమార్ 6, బల్కు అధికారి రజియుదిను, ఫ్లయింగ్, సెట్టింగ్ స్క్వాడ్ బృందాలు మరో 20 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి, బోధన్ విజయ్ సాయి జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి కాపీ చేస్తూ ఉండగా పట్టుకొని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలిపారు.