కామారెడ్డి, మే 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగం కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలోని ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాలలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం పరిశీలించారు.
పాఠశాలలోని తరగతి గదులు, వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పన కోసం అధికారులు ప్రతిపాదనలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎల్లయ్య, ఆయాపాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.