Daily Archives: May 17, 2022

పనితీరు మెరుగుపర్చుకోకుంటే కఠిన చర్యలు

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పనితీరును మెరుగుపర్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్యారోగ్య శాఖ ప్రగతిని సమీక్షించారు. ఆయా పీహెచ్‌సిల వారీగా పనితీరును సమీక్షిస్తూ, ఫలితాల సాధనలో వెనుకంజలో ఉన్న వారిని నిలదీశారు. ప్రధానంగా గర్భిణీల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు, సిజీరియన్‌ ఆపరేషన్లు, ఇమ్యూనైజషన్‌ తదితర …

Read More »

దళారీలకు విక్రయించి మోసపోవద్దు

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపల్లి, దోమకొండ, సంగమేశ్వర్‌లో దాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. రైతులు శుభ్రమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని కోరారు. తక్కువ ధరకు దళారీలకు విక్రయించి మోసపోవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర …

Read More »

నిశిత డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశానుసారం ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య బి. విద్యావర్ధిని తదితర సిబ్బంది మంగళవారం ఉదయం నిశిత డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ… నిశిత కళాశాలపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడం వల్ల ఆకస్మిక తనిఖీ నిర్వహించవలసిందిగా వీసీ ఆదేశించారని అన్నారు. చాలినన్ని …

Read More »

అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డైరెక్టర్‌ ఆఫ్‌ యూత్‌ సర్వీసెస్‌, సికింద్రాబాద్‌ వారి ఆదేశాల మేరకు 2023 జాతీయ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సామాజిక సేవా రంగం, సాహిత్య రంగం, క్రీడా రంగాల్లో విశిష్ట సేవలందించిన అభ్యర్థుల నుండి పద్మ అవార్డుల కొరకు ప్రభుత్వానికి సిఫార్సు చేయడానికి దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా యువజన, క్రీడల అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ …

Read More »

విద్యార్థులు సామాజిక బాధ్యత అలవరుచుకోవాలి

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల గిరిజన బాలుర డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌, కామారెడ్డి రక్తదాతల సమూహం,ఐవిఎఫ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఆర్‌ సిఎస్‌ జిల్లా అధ్యక్షుడు, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడుతూ విద్యార్థులు రక్త దానానికి ముందుకు రావడం …

Read More »

ప్రణాళికా బద్దంగా చదివి ఉద్యోగాలు సాధించాలి

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగాలు సాధించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ తరగతుల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. కష్టపడేతత్వం ఉంటే సులభంగా ప్రభుత్వ …

Read More »

25 నుంచి బి.పి.ఎడ్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బ్యాచులర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యూకేషన్‌ (బి.పి.ఎడ్‌.) కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు ఈ నెల 25 వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు నిర్వహింపబడుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. కావున ఈ విషయాన్ని బి.పి.ఎడ్‌. కళాశాలల …

Read More »

19న ఉద్యోగ మేళా

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈనెల 19న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అదికారి సిరిమల శ్రీనివాస్‌ తెలిపారు. ఉద్యోగ మేళాకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్‌ కార్డ్స్‌ హైదరాబాద్‌ జిల్లా 1. బ్రాంచ్‌ రిలేషన్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌, 2. బ్రాంచ్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, యూనిట్‌ మేనేజర్‌ ఉద్యోగాలున్నాయన్నారు. 18 సంవత్సరాల నుండి …

Read More »

ఇంటర్‌ పరీక్షల్లో ఒకరిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ పరీక్షల్లో పదవరోజు మంగళవారం జిల్లాలో కాపి చేస్తున్న ఒక విద్యార్థిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు కాగా 956 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్‌ హాజరు అయ్యారని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. రెండవ సంవత్సరం ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ పరీక్షలకు మొత్తం 17,815 మంది విద్యార్థులకు గాను 16,859 మంది విద్యార్థులు హాజరుకాగా 956 …

Read More »

మరమ్మతు పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపడుతున్న నిర్మాణాలు, ఇతర మరమ్మతు పనులను వేగవంతం చేస్తూ, సకాలంలో పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రగతి భవన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతి హాస్టల్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »