నిజామాబాద్, మే 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ పరీక్షల్లో పదవరోజు మంగళవారం జిల్లాలో కాపి చేస్తున్న ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాగా 956 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్ హాజరు అయ్యారని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. రెండవ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు మొత్తం 17,815 మంది విద్యార్థులకు గాను 16,859 మంది విద్యార్థులు హాజరుకాగా 956 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. మొత్తం 94.6 శాతం విద్యార్థులు హాజరయ్యారని, బోధన్ విజయ సాయి జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి కాపీయింగ్ పాల్పడుతుండగా మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పట్టణంలోని ఆదర్శ హిందీ జూనియర్ కళాశాల, ఎస్.ఎస్.ఆర్. జూనియర్ కళాశాల కంటేశ్వర్ రోడ్ లోని ఎస్.ఆర్. జూనియర్ కళాశాల, ఉమెన్స్ జూనియర్ కళాశాల జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిరంజీవి తనిఖీ చేసి సమీక్షించారు. అలాగే పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యురాలు కనకమహాలక్ష్మి పట్టణంలోని కాకతీయ మహిళ జూనియర్ కళాశాల, శ్రీ కాకతీయ జూనియర్ కళాశాల, మరో రెండు జూనియర్ కళాశాల ను తనిఖీ చేసి సమీక్షించారు. పరీక్షల నిర్వహణ కమిటీ మరో సభ్యులు చిన్నయ్య భీమగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, కృష్ణవేణి స్కూల్ పరీక్ష కేంద్రం, మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల బాల్కొండ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల తనిఖీ చేసి సమీక్షించారు.
బల్క్ అధికారి రజీయుదిన్ 4, హైపవర్ కమిటీ రవికుమార్ 4 పరీక్ష కేంద్రాలను, పరీక్ష నిర్వహణ కమిటీ సభ్యులు 12 పరీక్ష కేంద్రాలను, ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు మరో 20 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు.