కామారెడ్డి, మే 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల గిరిజన బాలుర డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్, కామారెడ్డి రక్తదాతల సమూహం,ఐవిఎఫ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఆర్ సిఎస్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ విద్యార్థులు రక్త దానానికి ముందుకు రావడం అభినందనీయమని చిన్నప్పటి నుండి సామాజిక బాధ్యతను విద్యార్థులు అలవర్చుకోవాలని అన్నారు.
14 సంవత్సరాలుగా వ్యక్తిగతంగా 66 సార్లు రక్తదానం చేయడమే కాకుండా, 10 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడం బాలు చేస్తున్న సేవలను అభినందించారు. జిల్లా కలెక్టర్ శిబిరంలో రక్తదానం చేశారు. ప్రతి మూడు నెలలకొకసారి రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నానని కలెక్టర్ ప్రకటించారు. 25 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
కార్యక్రమంలో రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ జమీల్ హైమద్, కామారెడ్డి రక్తదాతల అధ్యక్షుడు డాక్టర్ వేద ప్రకాష్, ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాధుల మహేష్ గుప్తా, గోవింద్ భాస్కర్ గుప్తా, వైస్ ప్రిన్సిపాల్ అభినయ శారాన్, ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త రామలక్ష్మి, స్టాఫ్ నర్సు శంకర్, అధ్యాపక బృందం, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.