కామారెడ్డి, మే 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిట్లం మండలం మద్దెలచెరువు, బొల్లక్ పల్లి చిల్లర్గి, పిట్లం మార్కెట్ కమిటీలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జుక్కల్ తాసిల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డిఓ రాజాగౌడ్ , సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.