పీజీ పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, మే 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌ ఎల్‌ ఎం, ఎల్‌ ఎల్‌ బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ (ఎపిఇ, పిసిహెచ్‌ అండ్‌ ఐఎంబిఎ) కోర్సులకు చెందిన పీజీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు.

ఉదయం జరిగిన మొదటి, ఎనిమిదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు మొత్తం 2675 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 2422 మంది హాజరు, 253 మంది గైర్హాజరు అయినట్లు ఆమె తెలిపారు.

మధ్యాహ్నం జరిగిన ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు మొత్తం 91 నమోదు చేసుకోగా 90 మంది హాజరు, 1 గైర్హాజరు అయినట్లు ఆమె తెలిపారు. నిజామాబాద్‌ గిరిరాజ ప్రభుత్వ కళాశాలలోని పరీక్షా కేంద్రంలో కెమిస్ట్రీ సబ్జెక్ట్‌కు చెందిన మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షలో ఒకరు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ డిబార్‌ అయినట్లు ఆమె పేర్కొన్నారు.

ప్రారంభమైన బి.ఎడ్‌. మొదటి సెమిస్టర్‌ పరీక్షలు

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక లాగ్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారభమైనాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు మొత్తం 1392 నమోదు చేసుకోగా 1328 మంది హాజరు, 64 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.

ప్రశాంతంగా కొనసాగుతున్న డిగ్రీ వన్‌ టైం చాన్స్‌ పరీక్షలు

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ కోర్సుకు చెందిన మొదటి, రెండవ, మూడవ ఇయర్‌ వైస్‌ (వన్‌ టైం చాన్స్‌) థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన మూడవ సంవత్సర బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు మొత్తం 286 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 250 మంది హాజరు, 36 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సంవత్సర బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు మొత్తం 79 నమోదు చేసుకోగా 70 మంది హాజరు, 09 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »