నిజామాబాద్, మే 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పౌర హక్కుల సంఘం తెలంగాణ రెండో రాష్ట్ర మహాసభలు ఈనెల 29న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో జరుగుతున్న రెండవ మహాసభ ఉదయం 10 గంటలకు బహిరంగ సభ ప్రారంభం అవుతుంది. అనంతరం మహాసభ ఉంటుంది. మహాసభలకు పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షత వహిస్తారు.
ప్రొఫెసర్ పైజన్ ముస్తఫా, వైస్ చాన్సలర్ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్, సి.యల్.సి. ప్రధాన కార్యదర్శి నారాయణ రావు, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు వి. చిట్టి బాబు, ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్, పౌర హక్కుల సంఘం సమన్వయ కమిటీ కన్వీనర్ క్రాంతి చైతన్య ప్రసంగిస్తారు. మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాసభల కరపత్రాలు ఆవిష్కరించారు. అల్గోట్ రవీందర్ మాట్లాడుతూ పౌర, ప్రజాస్వామిక వాదులు పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జెలెందర్, భాస్కర స్వామి, ప్రవీణ్, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.