నిజామాబాద్, మే 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఇంటర్ పరీక్షలలో ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాగా 779 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 16,961 మంది విద్యార్థులకు గాను 16,182 మంది విద్యార్థులు హాజరుకాగా 779 మంది విద్యార్థులు గైర్హాజర్ అయ్యారని తెలిపారు.
నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల కేంద్రంలో ఒకరు కాపీయింగ్‌కు పాల్పడుతుండగా మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు ఇంటర్ విద్యా అధికారి తెలియజేశారు . బుధవారం 11వ రోజు మొదటి సంవత్సరం విద్యార్థుల కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. బోర్డ్ స్క్వాడ్ బృందం జిల్లాలో బాల్కొండ మొడల్ స్కూల్ జూనియర్ కళాశాల, శ్రీ కాకతీయ జూనియర్ కళాశాల, ఆర్యనగర్ ఎస్సార్ జూనియర్ కళాశాల, నిజామాబాదు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల-బి కేంద్రము పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిందని తెలిపారు.
హెచ్.పి.సి రవికుమార్ 5 పరీక్ష కేంద్రాలు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు 10 పరీక్షా కేంద్రాలను, ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు మరో 20 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారని పేర్కొన్నారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి రాఘురాజ్ 5 జూనియర్ కళాశాలల్లో తనిఖీ చేసి సమీక్ష చేశారు. హైపవర్ కమిటీ రవికుమార్ శ్రీ కాకతీయ జూనియర్ కళాశాల మహిళా జూనియర్ కళాశాల, నారాయణ జూనియర్ కళాశాల, మోడ్రన్ కాకతీయ జూనియర్ కళాశాల, ధర్మారంలో సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల తనిఖీ చేయగా, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిరంజీవి చిన్నయ్య ఆర్మూర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, క్షత్రియ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల, శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల, మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, భీమగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, కృష్ణవేణి పాఠశాల పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యురాలు కనకమహాలక్ష్మి నిజామాబాద్ ఆర్మూరు రోడ్డులో ఎస్సార్ జూనియర్ కళాశాలలో కళాశాల తనిఖీ చేసి సమీక్షించారు.