నిజామాబాద్, మే 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఇంటర్ పరీక్షలు 2021- 2022 సంవత్సరానికిగాను విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రఘురాజ్ తెలిపారు. సుమారు 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండాకాలంలో వార్షిక పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామనీ పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, పోస్టల్ శాఖ, ఆర్టీసీ, విద్యుత్తు తదితర శాఖల సమన్వయంతో పరీక్షల నిర్వహణ సజావుగా పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి అన్నారు. జిల్లాలో 50 పరీక్ష కేంద్రాలను ప్రతి రోజు తనిఖీ చేశామన్నారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిరంజీవి, చిన్నయ్య, కనక మహాలక్ష్మి, హై పవర్ కమిటీ రవికుమార్, బల్కు అధికారి రజీయుదిన్, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, బోర్డు స్క్వాడ్ బృందాలు తనిఖీ చేసి సమీక్షించారని తెలిపారు. మొత్తం 12 మంది విద్యార్థులు కాపీ చేసిన వారిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు జిల్లా ఇంటర్ విద్య అధికారి చెప్పారు. పరీక్షలు విజయవంతంగా పూర్తిచేసిన ఇంటర్ సిబ్బందికి చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ అధికారులకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ లకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.