నిజామాబాద్, మే 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కెమిస్ట్రీ , కామర్స్ రెండవ సంవత్సరం ఇంటర్ పరీక్షల్లో ముగ్గురిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాగా 870 మంది విద్యార్థులు గైర్ హాజరు అయ్యారని జిల్లా ఇంటర్ విద్య అధికారి తెలిపారు. మొత్తం 17,011 మంది విద్యార్థులకు గాను 16,141 మంది విద్యార్థులు హాజరుకాగా 94.9 శాతం విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు.
గురువారం తాను జిల్లా కేంద్రంలోని వెక్టర్ జూనియర్ కళాశాల, విశ్వశాంతి జూనియర్ కళాశాలను తనిఖీ చేసి సమీక్షించినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి చెప్పారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిరంజీవి, చిన్నయ్య శ్రీ కాకతీయ జూనియర్ కళాశాల, మహిళా కాకతీయ జూనియర్ కళాశాల, గోల్డెన్ జూబ్లీ జూనియర్ కళాశాల, మాడ్రన్ కాకతీయ జూనియర్ కళాశాల తనిఖీ చేసి సమీక్షించారు . అలాగే హైపవర్ కమిటీ రవికుమార్ ఆధ్వర్యంలో 7 పరీక్షా కేంద్రాలు, ఫ్లయింగ్ , సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 21 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారని వివరించారు.