కామారెడ్డి, మే 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్మాణ ఆర్గనైజేషన్ హైదరాబాద్/ బోర్డేజ్ కార్పొరేషన్ వారి సహకారంతో కామారెడ్డి జిల్లా కు చెందిన 50 మంది బాధిత మహిళలకు శనివారం కిరణ సరుకులు, కుట్టు మిషన్లు, గార్మెంట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కోవిడ్ 19 వల్ల వితంతువులుగా మారిన మహిళలకు స్వచ్ఛంద సంస్థలు సరుకుల, వస్తువుల రూపంలో సాయం చేయడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని రమ్య, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా బాలల పరిరక్షణ అధికారిని స్రవంతి, ప్రాజెక్ట్ మేనేజర్ అబ్దుల్ ఖాదర్, చైల్డ్ లైన్ 1098 సమన్వయకర్త రజిత పాల్గొన్నారు.