కామారెడ్డి, మే 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 28న జరిగే హెచ్‌సిఎల్ జాబ్ మేళాకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో శనివారం జరిగినజూమ్ మీటింగ్‌లో మాట్లాడారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు జాబ్ మేళాకు హాజరుకావాలని కోరారు.
మైనారిటీ, కేజీబీవీ లో చదివిన విద్యార్థులకు అధ్యాపకులు సమాచారం అందించాలని సూచించారు. హెచ్‌సిఎల్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదివే వీలుందని అని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.