ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

నిజామాబాద్‌, మే 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత మహిళల విద్యార్థుల విశేషంగా కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం ఆయన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడంతో ఆదివారం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ, దళితుల అభ్యున్నతికి దళిత మహిళల విద్యార్జన కోసం భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. భాగ్యరెడ్డి వర్మ 134 జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపధ్యంలో సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.

మహనీయుల జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించుకోవడం ద్వారా వారిని గౌరవించుకోవడంతో పాటు మహనీయుల స్పూర్తితో సమాజ హితం కోసం ముందుకు సాగేందుకు ఈ వేడుకలు దోహదపడుతున్నాయని అభిప్రాయపడ్డారు. భాగ్య రెడ్డి వర్మ 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని ఆయన సేవలను కొనియాడారు.

దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిణి శశికళ, కలెక్టరేట్‌ ఏ.ఓ సుదర్శన్‌, సంబంధిత శాఖ అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »