Daily Archives: May 23, 2022

పరిపూర్ణ లక్ష్య సాధన దిశగా పల్లె ప్రగతి అమలు

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే నెల జూన్‌ 3 నుండి 17వ తేదీ వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పల్లె ప్రగతి కార్యక్రమానికి అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌లో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, సాధించాల్సిన ప్రగతి …

Read More »

వార్డుల వారీగా పారిశుధ్య పనులు చేపట్టాలి

కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతిలో వార్డుల వారీగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం పట్టణ ప్రగతిలో చేపట్టే అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి పట్టణాల్లో మూడు బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక …

Read More »

ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు …

Read More »

మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా చూడాలి

కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉన్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. పరీక్ష కేంద్రంలోని వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రంలో మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా అధికారులు చూడాలని సూచించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. కామారెడ్డి పట్టణంలోని బాలుర పాఠశాలలోని …

Read More »

24న ఛలో కలెక్టరేట్‌

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ కూలీల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న జరిగే చలో కలెక్టరేట్‌ ను జయప్రదం చేయాలని సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నిజామాబాద్‌ డివిజన్‌ కార్యదర్శి వెంకన్న అన్నారు. ఈ మేరకు సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నాదన్నారు. ఉపాధి కూలీలకు కనీస వేతనం …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల …

Read More »

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమవగా, తొలి రోజునే కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని మానిక్‌ భవన్‌ పాఠశాలతో పాటు కాకతీయ హై స్కూల్‌ ఎగ్జామ్‌ సెంటర్లను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత …

Read More »

ప్రగతి నివేదికలు అందజేయాలి

కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రగతి నివేదికలు మంగళవారం వరకు సిపిఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వేడుకలకు రాష్ట్ర శాసన సభా పతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి హాజరవుతారని తెలిపారు. …

Read More »

మే 31 నుండి పరీక్షలు

కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓపెన్‌ స్కూల్‌ పదవ తరగతి, ఇంటర్‌ పరీక్షలు మే 31 నుంచి జూన్‌ 18 వరకు జరుగుతాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ఓపెన్‌ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలకోసం విద్యాశాఖ అధికారులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »