కామారెడ్డి, మే 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పరీక్ష కేంద్రంలోని వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రంలో మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చూడాలని సూచించారు.
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. కామారెడ్డి పట్టణంలోని బాలుర పాఠశాలలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ పరిశీలించారు. సిసి కెమెరాల పనితీరును గమనించారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో పదవ తరగతి పరీక్షల నిర్వహణ కోసం సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఫిర్యాదులు, సమస్యలు తెలిపేందుకు సెల్ నెంబర్ 7661854856 ను సంప్రదించాలని పేర్కొన్నారు.