కామారెడ్డి, మే 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
ప్రగతి నివేదికలు మంగళవారం వరకు సిపిఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వేడుకలకు రాష్ట్ర శాసన సభా పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు కలెక్టరేట్లో కవి సమ్మేళనం కార్యక్రమం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, విద్యాశాఖ అధికారి రాజు, ఆర్డీవో శీను, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.