కామారెడ్డి, మే 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణ ప్రగతిలో వార్డుల వారీగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం పట్టణ ప్రగతిలో చేపట్టే అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి పట్టణాల్లో మూడు బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక బృందంలో ఐదుగురు చొప్పున మొత్తం 15 మంది ఉండాలని తెలిపారు. వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో 15 మంది పారిశుద్ధ్య పనులు చేపట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, సిపిఓ రాజారాం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.