నందిపేట్, మే 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని బజార్ కొత్తూరు శివారులోని గోదావరి తీరాన గుర్తు తెలియని శవం లభ్యం అయింది. నందిపేట్ ఎస్ఐ ఎస్ మురళి తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మెడ గ్రామం పాతూర్ శివారులో గల గోదావరి నదిలో గుర్తు తెలియని మగ మనిషి శవం పూర్తిగా కృళ్ళిపోయి ఉందని, ఉమ్మెడ గ్రామ కార్యదర్శి అనిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిపేట్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మృతుని వయస్సు 30 -35 సంవత్సరాలు ఉంటుందని, శవం పూర్తిగా కృళ్ళిపోయి వున్నదని ఎస్ఐ తెలిపారు. మృతుడి పైన లేత పసుపు రంగు నలుపు చుక్కలు డిజైన్ గల షర్ట్, బ్రౌన్ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. మృతుని ఎత్తు సుమారు 5.2 ఫీట్లు వుంటుందని కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.