కామారెడ్డి, మే 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి రోడ్డులోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో శనివారం ఉదయం 10:30 గంటలకు ధరణి టౌన్షిప్ ప్లాట్ల కొనుగోలుపై ఫ్రీ బెడ్ సమావేశం ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సమావేశానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్లాట్లు, అసంపూర్తిగా ఉన్న గృహాల కొనుగోలుపై ఆసక్తి ఉన్న ప్రజలు సకాలంలో హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. సమావేశానికి ధరణి టౌన్షిప్ అధికారులు, బ్యాంకు అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు.