Monthly Archives: May 2022

మార్క్‌ఫెడ్‌ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రులు

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మార్క్‌ఫెడ్‌ కార్యాలయ నూతన భవనాన్ని శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్‌ పల్లా …

Read More »

రహదారి భద్రత మన అందరి బాధ్యత

కామారెడ్డి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు భద్రత నియమ నిబంధనలపై అవగాహన కల్పించాలని రోడ్స్‌, రైల్వేస్‌ అడిషనల్‌ డిజిపి సందీప్‌ శాండిల్య అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం రహదారి భద్రత మన అందరి బాధ్యత అనే అంశంపై అవగాహన సదస్సులో మాట్లాడారు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయని …

Read More »

డ్రోన్‌ ద్వారా పిచికారి చేయడం సులభం

కామారెడ్డి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డ్రోన్‌ యంత్రం ద్వారా పురుగుమందులు పిచికారి చేయడం సులభమని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద శుక్రవారం డ్రోన్‌ యంత్రం ద్వారా పురుగుమందులు పిచికారీ చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. 7 నిమిషాల్లో ఎకరం పంటకు పురుగుమందులు పిచికారి చేయవచ్చని సూచించారు. మహిళా …

Read More »

ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం … ఒకరి పై మాల్‌ ప్రాక్టీస్‌ కేస్‌ నమోదు

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2021-22 విద్యా సంవత్సర ఇంటర్‌ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మొదటి సంవత్సరం విద్యార్థుల పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. మొత్తం 17,932 మంది విద్యార్థులకు గాను 793 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 17,139 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రఘురాజ్‌ తెలిపారు. వీరిలో 15,740 మంది జనరల్‌ విద్యార్థులకు గాను 584 …

Read More »

సృజనాత్మకతను వెలికితీసే వేదిక కావాలి

కామారెడ్డి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కళాభారతి ఆడిటోరియం భవనాన్ని శుక్రవారం రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడారు. సృజనాత్మకతను వెలికి తీసే వేదిక కళాభారతి కావాలని అని తెలిపారు. కామారెడ్డి ప్రజలకు గంప గోవర్ధన్‌ లాంటి నాయకులు దొరకడం …

Read More »

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2021-22 విద్యా సంవత్సరం ఇంటర్‌ వార్షిక పరీక్షలకు జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి రఘురాజ్‌ తెలిపారు. మే 6 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 50 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 35,522 మంది పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. వీరిలో మొదటి …

Read More »

సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలం పంటల సాగు యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పించేందుకు వీలుగా మాక్లూర్‌ మండలం మామిడిపల్లి లోని శ్రీ అపురూప వేంకటేశ్వరస్వామి ఆలయం ఆవరణలో గల కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించనున్న నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లా సదస్సును పురస్కరించుకుని ఏర్పాట్లను గురువారం నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పరిశీలించారు. తన వెంట ఉన్న పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నాగరాజు, అదనపు …

Read More »

వాహన యజమానులకు ముఖ్య సూచన

కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వాహన యజమానులు తమ తమ వాహనపత్రాలు (డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌, ఫిట్‌ నెస్‌, పర్మిట్‌, టాక్స్‌, ఇన్సూరెన్స్‌) తదితర అన్ని రకాల పత్రాలు సరి చేసుకొని రోడ్డుపైన తిరగాలని కోరారు. గత రెండు సంవత్సరాలుగా కరోనాతో ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కొంత వెసలుబాటు కల్పించిందని, కానీ ఇప్పుడు వాహన పత్రాలు సరిచేసుకొని …

Read More »

హెల్మెట్‌ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలి

కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ద్విచక్రవాహనాల చోదకులు హెల్మెట్‌ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ద్విచక్రవాహనాల చోదకులు హెల్మెట్‌ ఉపయోగించక పోవడం వల్ల ప్రమాదం జరిగితే మృత్యువాత పడుతున్నారని తెలిపారు. జాతీయ రహదారిపై వేగం పరిమితి …

Read More »

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నే వందశాతం సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి

కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిలో సీ-సెక్షన్లను తగ్గించి, సహజ ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వందశాతం సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సాధారణ ప్రసవాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, గర్భిణుల నమోదు, ఏఎన్‌సి చెకప్‌, క్షయ వ్యాధి నిర్మూలన అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »