కామారెడ్డి, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాలోత్ శంకర్ (75) వృద్ధుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆపరేషన్ నిమిత్తమై ఏబి పాజిటివ్ రక్తం మెదక్ ప్రభుత్వ వైద్యశాలలో కావాల్సి ఉండగా అక్కడ రక్తం అందుబాటులో లేకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్, ఐవిఎఫ్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు.
వెంటనే స్పందించి కామారెడ్డి పట్టణానికి చెందిన సయ్యద్ ఖాన్‌కి తెలియజేయడంతో ఏబి పాజిటివ్ రక్తాన్ని ఠాకూర్ రక్తనిధి కేంద్రం లో అందజేశారు. ఆపదలో ఉన్నవారికి రక్తం అందజేసేందుకు వచ్చిన రక్తదాతకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహేష్ గుప్తా, రాజు టెక్నీషియన్ చందన్ తదితరులున్నారు.