నిజామాబాద్, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : షర్మిలమ్మ ముఖ్యమంత్రి అయిన తరువాత మొదటి సంతకం ఉద్యోగాల భర్తిపైనే పెడతానని హామీ ఇచ్చారని, ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, పేదలకు ఇండ్లు, కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇవ్వడమే షర్మిలమ్మ మొదటి ప్రాధాన్యత అని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కో ఆర్డినెటర్ బుస్సాపూర్ శంకర్ తెలిపారు.
ఇంటింటికీ వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 7వ డివిజన్‌లో పార్టీ నాయకులతో కలసి ఇంటింటికి వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నగర బీసీ విభాగం అధ్యక్షులు సదానంద చారి, జిల్లా మహిళ నాయకురాలు లావణ్య, నగర యువజన విభాగం అధ్యక్షులు ప్రితం, నగర మైనారిటీ విభాగం అధ్యక్షులు అజిమ్, ఆర్షద్ తదితరులు పాల్గొన్నారు.