కామారెడ్డి, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో వైకుంఠధామం, క్రీడా ప్రాంగణంను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తుందని సూచించారు.
పట్టణాల్లో పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.