బోధన్, జూన్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 11వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రుద్రూర్ మండలంలో గల బీడీ కార్ఖానాల్లో యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు.
ఇందులో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి. మల్లేష్ మాట్లాడుతూ మహాసభల్లో ఇప్పటివరకు యూనియన్ చేసిన ఉద్యమాలను సమీక్షించుకుని ప్రస్తుతం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన భవిష్యత్తు పోరాట కార్యక్రమాలను రూపొందించుకోవడం జరుగుతుందని కార్మికులందరు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో దుర్ధాన, వెంకటలక్ష్మి, సరస్వతి, మోత్కూరి లక్ష్మి, కవిత, సవిత, రజిని, పోశవ్వ, రజియా, రహీమా, ల్యాకత్ బీ, జ్యోతి, లక్ష్మి, అంజవ్వ తదితరులు పాల్గొన్నారు.