‘కంటి వెలుగు’లో భాగంగా కాటరాక్టు ఆపరేషన్లు చేపట్టాలి

నిజామాబాద్‌, జూన్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంటి వెలుగు కార్యక్రమం కింద ఎంపిక చేసిన వారికి కాటరాక్ట్‌ ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు.

మంగళవారం ఆయన వైద్యారోగ్య శాఖ పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించి కాటరాక్టు ఆపరేషన్లు అవసరం ఉన్న వారిని గుర్తించడం జరిగిందన్నారు. శిబిరాల్లో ఎంపిక చేసిన వారిని ఆపరేషన్ల కోసం జీజీహెచ్‌కు పంపించాలని సూచించారు.

ప్రతిరోజూ కనీసం నలభై మందికి ఆపరేషన్లు చేయాలని, పీహెచ్‌సీల వారీగా పేషేంట్లను పంపించాలని అన్నారు. సోమ, మంగళవారం నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలోని పీహెచ్‌సీల పేషేంట్లను, బుధ, గురువారం ఆర్మూర్‌, శుక్ర, శనివారం బోధన్‌ డివిజన్‌ పరిధిలోని పేషంట్లను పంపించాలని తెలిపారు. ఈ విషయంలో వైద్యాధికారులు, సిబ్బంది ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. కాగా, జీజీహెచ్‌, జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు సంబంధించిన పనులను యుద్దప్రాతిపడిన చేపడుతూ, నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయించాలని సంబంధిత విభాగం ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

ఆయా చోట్ల పనుల ప్రగతిని కలెక్టర్‌ ఈ సందర్భంగా సమీక్షిస్తూ పనుల పూర్తికి గడువులు విధించారు. శానిటేషన్‌ పనులు, రోగులకు భోజనం అందించేందుకు డైట్‌ టెండర్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలం సీజన్‌ ను దృష్టిలో పెట్టుకుని అన్ని ఆసుపత్రుల్లోనూ సరిపడా మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు మరింతగా కృషి చేయాలన్నారు.

గర్భిణీ స్త్రీలకు రక్త హీనత సమస్య ఏర్పడకుండా వారి ఆరోగ్య పరిస్థితిని మొదటి నుండే క్షుణ్ణంగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి గర్భిణీ మహిళా వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, ఈ విషయంలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. విధుల పట్ల అలసత్వాన్ని ప్రదర్శిస్తే సస్పెండ్‌ చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుదర్శనం, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్‌, మహిళా శిశు సంక్షేమ అధికారిణి రaాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »