కామారెడ్డి, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రయివేటు రంగములో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 10న శుక్రవారం ఉదయం 10:30 గంటల నుండి మద్యాహము 2 గంటల వరకు కలెక్టరేట్లోని మొదటి అంతస్తు లో గల రూమ్ నెంబర్ 121 లోని జిల్లా ఉపాది కల్పనా కార్యాలయం కామారెడ్డిలో జాబు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాది కల్పనధికారి ఎస్. షబ్న ఒక ప్రకటనలో తెలిపారు
కామారెడ్డి ప్రముఖ శ్రీ విజయ బయో ఫర్టిలైజర్ కంపెనీలొ 1) సేల్స్ రిప్రజెంట్ ఫీమేలర్స్ – 45 పోస్టులు, సేల్స్ రిప్రజెంట్ ఫీమేలర్స్ – 30 పోస్టులు ఉన్నాయన్నారు. విద్యార్హతలు ఎస్ఎస్సి పూర్తి చేసి ఉండాలన్నారు.
గ్రూప్ లీడర్స్ మేల్, ఫీమెల్ 10 పోస్టులు ఉన్నాయని, ఇంటర్ పూర్తిచేసిన వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులకు నెలకు 10,000 వేతనం, ఇన్సెంటివ్స్ ఉంటాయన్నారు. ఈ పోస్ట్‌ల కోసం నిరుద్యోగ యువకులు మత్రమే అర్హులని, వయస్సు 21 సంవస్సరాల నుండి 36 సంవస్సరాల లోపు వారై ఉండాలన్నారు. జాబ్ ఇంటర్వ్యూ కు హాజరు అయ్యే వాళ్ళు బయో డేటాతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు మరియు ఆధార్ కార్డు, ఫోటోలతో హాజరు కావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 7013967321, 9848237987, 7671974009 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.