రాజన్న కుటుంబానికి మాట తప్పే అలవాటు లేదు

నిజామాబాద్‌, జూన్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటింటికీ వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌ నగరంలో వైఎస్‌ఆర్‌ టీపీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ప్రజల గుండెల్లో రాజన్న బ్రతికే ఉన్నారని, ప్రజల్లో రాజన్న కుటుంబంపై విశ్వసనీయత ఉందని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు, నినమాబాద్‌ అర్బన్‌ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినెటర్‌ బుస్సాపూర్‌ శంకర్‌ తెలిపారు.

రాజన్న కుటుంబానికి మాట తప్పే అలవాటు లేదని, మడమ తిప్పే అలవాటు లేదని ఇచ్చిన మాట ప్రకారం ఎంత కష్టమైన ఆ మాట నిలబెట్టుకుంటారనే విశ్వసనీయత ప్రజల్లో ఉందన్నారు. ప్రతి మహిళకు సొంత ఇల్లు, ప్రతి విద్యార్థికి ఉచిత విద్య, ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, ఉపాధి, స్వయం సమృద్ధి షర్మిలమ్మ కల్పిస్తారన్నారు.

మహిళలకు కార్పొరేషన్ల ద్వారా లోన్లు, ఇంట్లో ఎంత మంది పెన్షన్‌కు అర్హులో అంతమందికి పెన్షన్‌, ఆరోగ్య శ్రీ బలోపేతం చేస్తారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ఉద్యమకారులకు సొంత ఇండ్లు, ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. ప్రజలంతా షర్మిలమ్మకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. షర్మిలమ్మ రాజన్న సంక్షేమ పాలన తీసుకు వస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ మహిళ విభాగం జిల్లా కార్యదర్శి స్వప్న, జిల్లా మహిళ నాయకురాలు లావణ్య, నగర యువజన విభాగం అధ్యక్షులు ప్రితం, నగర మైనరీటీ విభాగం అధ్యక్షులు అజిమ్‌, అన్వర్‌, ఆర్షద్‌, వినోద్‌, రాహుల్‌, అసిఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »