నిజామాబాద్, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల బస్వాగార్డెన్‌లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో బుధవారం ఋణ విస్తరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు.
ఉదయం 10.00 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ఋణ విస్తరణ కార్యక్రమంలో అన్ని బ్యాంకులు పాల్గొని అన్ని రకాల ఋణాలు, ఇతర బ్యాంకింగ్ సేవలు అందిస్తాయన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు కోరారు.