కామారెడ్డి, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లక్ష్మి (28) గర్భిణీ రక్తహీనతతో బాధపడుతుండటంతో వారికి కావలసిన ఓ పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారి బంధువులు ఐవిఎఫ్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి సింగరాయపల్లికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సహకారంతో సకాలంలో రక్తాన్ని అందించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి, గర్భిణీ స్త్రీల కోసం, తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం, సకాలంలో రక్తాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని రక్తదాతకు రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు, కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వీ.టి. ఠాకూర్ రక్తనిధి టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.