నిజామాబాద్, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా బుధవారం లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో వినాయక్ నగర్ బస్వా గార్డెన్లో ఋణ విస్తరణ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని అన్ని బ్యాంకులు కార్యక్రమంలో పాల్గొని వివిధ రకాల బిజినెస్ లోన్, వ్యవసాయ రుణాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లకు గృహ, కార్ లోన్లు మంజూరు చేశారు.
లీడ్ బ్యాంకు అధికారి ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నరేంద్రకుమార్ డీజీఎం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ సతీష్ కుమార్ జనరల్ మేనేజర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు, శ్రీకారం రీజినల్ మేనేజర్ ఎస్బిఐ, దుర్గాప్రసాద్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్బిఐ, నారాయణ రీజినల్ మేనేజర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు, రాఘవేంద్ర కుమార్ కెనరా బ్యాంకు, యాదగిరి జనరల్ మేనేజర్ ఎన్.డి.సి.సి బ్యాంకు, నగేష్ డీజీఎం పాల్గొన్నారు.