నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకీ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రైతాంగానికి నిర్దేశిత లక్ష్యానికి మించి రుణాలు అందించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి బ్యాంకర్లకు హితవు పలికారు. గురువారం కలెక్టరేట్ ప్రగతి భవన్‌లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. గత ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సాధించిన …
Read More »Daily Archives: June 9, 2022
అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరు
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని బిబిపేట్, దోమకొండ మండలాలకు చెందిన విద్యార్థులు ఆరు సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కూతురు, ప్రస్తుత ఎంఎల్‌సి కవిత అధికారంలోకి రాగానే రాయికల్, దోమకొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, 2016-17 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కూడా చేసుకోవచ్చని హామీ ఇచ్చారని, …
Read More »ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను గురువారం కేంద్ర బృందం సందర్శించింది. లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం రికార్డులను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన సిమెంట్ రోడ్లను పరిశీలించారు. రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన నిధుల వివరాల రికార్డులు చూశారు. పల్లె ప్రకృతి వనం, కోతుల ఆహార కేంద్రం సందర్శించారు. …
Read More »వైభవంగా ముగిసిన ప్రతిష్ఠాపన పర్వం
నందిపేట్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి ఆలయంలో గడిచిన ఆరు రోజుల పాటు కన్నుల పండువగా సాగిన ప్రతిష్ఠాపన మహోత్సవం సుసంపన్నమైంది. భక్తులు ఆహ్లాదకర వాతావరణంలో స్వామి వారి తొలి దర్శనం చేసుకుని పులకించి పోయారు. ఆరవ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రాణప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠించబడిన రాజ్యలక్ష్మి సమేత నరసింహుడు, …
Read More »నారాయణ కళాశాలకు గుర్తింపు లేదు
నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పట్టణంలోని ఆర్యనగర్‌లో నారాయణ జూనియర్ కాలేజ్ (కార్పొరేట్) పేరిట ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్లు తీసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఈ కళాశాలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఇంతవరకూ ఎలాంటి గుర్తింపు లేదని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ గురువారం స్పష్టం చేశారు. నారాయణ కాలేజ్ (కార్పొరేట్) పేరిట ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను అపోహలకు గురిచేస్తూ …
Read More »తొలకరి పలకరింపు
నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం తెల్లవారుజామున తొలకరి జల్లు పలకరించి పరవశింపజేసింది. సాధారణంగా మృగశిర కార్తె రోజు తప్పకుండా వర్షం కురుస్తుందని భావిస్తారు. కాగా బుధవారం సాయంత్రం ఈదురుగాలులు వీచినప్పటికి వాన జాడ కానరాలేదు. కానీ తెల్లవారేసరికి వరుణుడు కరుణించాడు. రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్‌లో పలుచోట్ల వాన ముసురుపట్టినట్టుగా కురుస్తూనే ఉంది. మరోవైపు వాతావరణ శాఖ కూడా మూడురోజులు …
Read More »