నిజామాబాద్, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పట్టణంలోని ఆర్యనగర్‌లో నారాయణ జూనియర్ కాలేజ్ (కార్పొరేట్) పేరిట ఇంటర్మీడియట్లో అడ్మిషన్లు తీసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఈ కళాశాలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఇంతవరకూ ఎలాంటి గుర్తింపు లేదని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ గురువారం స్పష్టం చేశారు.
నారాయణ కాలేజ్ (కార్పొరేట్) పేరిట ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను అపోహలకు గురిచేస్తూ అడ్మిషన్లు చేస్తున్నారని కొన్ని విద్యార్థి సంఘాల ద్వారా తెలిసిందని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలిపారు. కావున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రఘురాజ్ తెలిపారు.
నారాయణ (కార్పొరేట్) కళాశాల పేరిట అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తమకు ఆధారాలు దొరికినట్లు అయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని కూడా జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ స్పష్టం చేశారు.