కామారెడ్డి, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని బిబిపేట్, దోమకొండ మండలాలకు చెందిన విద్యార్థులు ఆరు సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కూతురు, ప్రస్తుత ఎంఎల్‌సి కవిత అధికారంలోకి రాగానే రాయికల్, దోమకొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, 2016-17 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కూడా చేసుకోవచ్చని హామీ ఇచ్చారని, రాయికల్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పడగ దోమకొండలో కనీసం ప్రతిపాదనలకు కూడా మోక్షం లభించలేదని కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
గురువారం దోమకొండ మండల కేంద్రంలో ఎన్‌ఎస్‌యుఐ, యువజన కాంగ్రెస్ ఆద్వర్యంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమకొండ డిగ్రీ కళాశాల సాధన సమితిగా ఏర్పడి మండలాల విద్యార్థులు వందరోజుల ధర్నా, పోరాటం చేశారు. ముఖ్యమంత్రి కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చి కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కనీసం 2022-23 విద్యా సంవత్సరానికైనా డిగ్రీ కళాశాల ఏర్పాటు అవుతుందని ఆశించారు, ఉద్యమం చేసిన వారిని ప్రలోభాలు పెట్టి పార్టీ మార్పించుకొని కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సాధించలేని మన ఎమ్మెల్యే మండలంలో పర్యటిస్తే తప్పకుండా అడ్డుకుంటామన్నారు. కాలేజ్ సాధించేవరకు ఉద్యమం చేయడానికి సిద్ధమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు రెండు మండలాల విద్యార్థులకు అత్యవసరంగా మారింది. అయినా అవకాశవాద నాయకులు దృష్టి సారించకపోవడంతో ఎన్నికల హామీగానే మిగిలిపోయింది.
నిరసన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అనంత్ రెడ్డి, కామారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్ కుమార్, అబ్బర బోయిన స్వామి మధు, శ్రీనివాస్, నరేష్, సిద్దారెడ్డి, గోపాలరెడ్డి, రాజేశ్వర్, జనార్ధన్, పాపయ్యా, నాగరాజ్, చీమర్ల సుదీర్, రాహుల్, ఫణి, రమేష్ రెడ్డి, రమాకాంత్, రవితేజ, రాకేష్ రెడ్డి, మహ్మద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.