కామారెడ్డి, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్యాసంపల్లి గ్రామానికీ చెందిన నేమ్యా (70) కు ఆపరేషన్ నిమిత్తంమై ప్రభుత్వ వైద్యశాలలో బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో చిన్న మల్లారెడ్డి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అశోక్ రెడ్డి 17 వ సారి బి నెగిటివ్ రక్తాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్, ఐవిఎఫ్ జిల్లా సమన్వయకర్త బాలు మాట్లాడుతూ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. నేటి సమాజంలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే కావడం చాలా బాధాకరమని, మానవ జీవితానికి సార్ధకత పరోపకారమే అని ప్రతి ఒక్కరు తోటివారికి వీలైనంతవరకూ సహాయం చేయాలని కోరారు.
యువత రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినట్లయితే ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. కార్యక్రమంలో వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లు చందన్ పాల్గొన్నారు.