నిజామాబాద్, జూన్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర పాండేను నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్‌లో గల నిఖిల్ సాయి హాల్లో న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించారు. కార్యక్రమంలో న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ ఆనంద్, ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ గౌడ్, లీగల్ సెల్ కన్వీనర్ రాజ్‌కుమార్ సుబేదార్, ఉపాధ్యక్షులు పడిగెల వెంకటేశ్వర్, బిట్ల రవి తదితరులు పాల్గొన్నారు.